ఫస్టాఫ్‌ మనది.. సెకండాఫ్‌ వారిది

టాస్‌ గెలిచిన కివీస్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐసీసీ టోర్నమెంట్లలలో తన ఫేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ స్మృతి మంధాన (11) వచ్చి వెళ్లగా.. అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా కాసేపు మెరుపులు మెరిపించారు. అయితే అదే ఊపులో రోజ్‌మెరి బౌలింగ్‌లో తానియా(23) క్యాచ్‌ ఔటాయ్యారు. అయితే మరోవైపు షఫాలీ తనదైన రీతిలో బ్యాటింగ్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పదిఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. మెల్‌బోర్న్‌: పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు. క్రీజులో టీనేజర్‌ సంచలనం షఫాలీ వర్మ, నమ్మదగ్గ బ్యాటర్‌ రోడ్రిగ్స్‌. ఇంకా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మలు బ్యాటింగ్‌కు సిద్దంగా ఉన్నారు. దీంతో టీమిండియా అవలీలగా 150 పరుగులు దాటుతుందనుకున్నారు. కానీ చివరకి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమయ్యారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షపాలీ(34 బంతుల్లో46; 4ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిలార్డర్‌ కివీస్‌ బౌలింగ్‌కు తడబడి వెనుదిరిగారు. బౌలింగ్‌లో అమెలియా కెర్‌(2/21), రోజ్‌మెరీ మెయిర్‌(2/27) కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టారు. 


Popular posts