అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం 11:45 గంటలకు అహ్మదాబాద్ సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరెడ్ కుష్‌నర్‌లు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడి డ్రెస్‌ను ఆమె ధరించారు. బౌవుడ్ నెక్‌లైన్‌తో, పఫ్పుడ్ స్లీవ్స్‌తో డ్రెస్ చాలా అందంగా ఉంది. మామూలుగానే ఎత్తుగా ఉండే ఆమె డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా పొడవైన ఎర్రటి హైహీల్స్ ధరించి మరింత ఎత్తుగా కనిపించారు. (ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు.. )
ఇవాంకా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్‌ఫిగర్, ససాన్ జీన్స్ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్ మ్యాగజైన్ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్ టీన్ యూఎస్‌ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అందాల రాశిగా గుర్తింపు వచ్చినా... తర్వాతికాలంలో ఇవాంకా మోడలింగ్‌ను వదిలేసి పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది.