ఇసుక అక్రమంగా తరలిస్తే జైలే!

 అమరావతి: ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈమేరకు నిబంధనలను సవరించింది. ప్రస్తుతం అక్రమాలకు పాల్పడితే స్వల్ప జరిమానాలతోనే సరిపెట్టే విధంగా ఏపీ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌–1966 ఉన్నాయి. వీటికి మరింత పదును పెట్టి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అధిక ధరలకు విక్రయిస్తే రెండేళ్ల పాటు జైలు శిక్షతోపాటు రూ.రెండు లక్షల జరిమానాలు విధించేలా నిబంధనలు సవరిస్తూ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోసున్నారు.  


►ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షల వరకూ కనీస జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ గణుల చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం

►అక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను డిస్పోజ్‌ చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టడానికి, వ్యర్థాలను తీసుకెళ్తున్న వాహనాలను సరిగ్గా ట్రాక్‌ చేయడానికి ఏపీ పర్యావరణ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.